ఆలికి చనువిచ్చిన చో దేలిక కులమందుదైన దేలిక చేయున్ లాలించిన కొలదిగనను కూలత గొను నధికకులజ గువ్వలచెన్నా! భావం:- పెళ్లానికి చనువిచ్చి నెత్తికి ఎక్కించుకుంటే తక్కువ కులంపిల్ల అయునా చులకన చేస్తుంది. అదే పెద్ద వంశం ఇల్లాలు అయితే ప్రేమగా లాలించే కొద్దీ అనుకూలంగా వుంటుంది.
చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
Saturday, 25 June 2016
Monday, 20 June 2016
పల్లె- పాప పసిపాప నవ్వులా పల్లె ఎంత అందం చిన్నితల్లి పలుకులా వేస్తుంది భందం. చిట్టిపాప నడకలా గలగల సెల ఏరు. చిన్ని పాప ఆటలా తల వూపును పైరు. తడబడు ఆ చిరునడకలు లేగదూడ గెంతులు చిన్నితల్లి కెరింతలు కొకిలమ్మ పాటలు బోసి నోరు తలపించును సరసులోని తామరలు బుంగమూతి మురిపించును లేతమావి పిందెలు చిట్టీపాప స్నానమాడ ఇల్లంతా సందడి చిరుజల్లులు కురియువేల పల్లంతా సవ్వడి.
చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు గణ యతి ప్రాసల రస ధ్వని శాఖల కవితలల్లు పులుగు నవ నవ పధముల కవితా రధముల సాగిపోవు నెలవు అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రస ధారయై ధ్రువ తారయై మన దేశ భాషలను లెస్సయై దేవ భాషతో చేలిమిచేసి పలు దేశ దేశముల వాసికెక్కినది మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు మన భాష పాల కడలి భావం మధు మురళి అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ......
sekarana: ratnakar
| మా మంచిఊరు | ||||
| అమ్మమ్మ ఇంటికి పొదాము | ||||
| అక్కడ వింతలు చూద్దాము | ||||
| పల్లెల లో చల్లదనం | ||||
| చక్కకఆస్వాదిద్దాము | ||||
| పాడిపంటలనిలయాలు | ||||
| పచ్చని తోటల వలయాలు | ||||
| నీటితొనిండినచెరువులు, సరసులు | ||||
| నిత్యంపూసేపువ్వులతోపులు | ||||
| పక్షుల కిలకిలరావాలు | ||||
| గుడిలొ గంటల గణగణలు | ||||
| ఆప్యాయంగా పలకరింపులు | ||||
| ఆదరించేటి మంచిమనసులు | ||||
| వేసవి గడిపె చక్కని విడుదులు | ||||
| వర్ణింప లేనివి పల్లెసొగసులు | ||||
| సెలవలు అక్కడ గడిపెస్తాం | ||||
| బడులు తీసాక తిరిగొస్తాం. | ||||
Subscribe to:
Comments (Atom)























































