Wednesday, 31 May 2017

15.వ.పాఠం , 1.వ.తరగతి - కాకరకాయ

1.వ.తరగతి....తెలుగు...15.వ.పాఠం....వర్క్ బుక్ ఆరు పేజీలు..క్రమంలో ప్రింట్ వేస్తే సరి.....రత్నాకర్ మాష్టర్

page 1


page 2



page 3

 page 4


 page 5


 page  6

SUBHAMASTHU === RATNAKAR 

Thursday, 11 May 2017

దానే దానే పర్ లికా హై.. ఖానే వాలాకా నామ్.. తినే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. కానీ సుజాత మాత్రం తినే ప్రతీ గింజ మీద పండించిన రైతు పేరు రాస్తున్నది.
సేంద్రియ పద్ధతిలో రైతులు సాగుచేసిన ఆహార ధాన్యాలు సేకరిస్తున్నది.Daana.in అనే వెబ్‌సైట్ వేదికగా, ఆర్గానిక్ ధాన్యపు గింజల వ్యాపారం చేస్తూ... ఆర్గానిక్ అవసరాన్ని తెలియజేస్తున్న సుజాత రమణి పరిచయం ఇది..!

అబ్బా.... ఏం తిండి ఇదీ..? రుచీ.. పచీ లేదు. అసలు ఈ కూరగాయలు నేల మీదే పండుతున్నాయా? ఒకప్పుడు కరివేపాకు చెట్టు అల్లంత దూరాన ఉండగానే కమ్మటి వాసన వచ్చేది. 
ఇప్పుడు ఆకు తెంపి ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన తెలియడం లేదు. అంతా మందుల తిండి అయిపోయింది ఓ పెద్దావిడ నిర్వేదం.

అబ్బబ్బా.... పొద్దున ఏశిన పొయ్యి మీద పప్పు.... రెండు గంటలైతుంది. ఎంతకూ ఉడుకుతలేదు. 
ఈ పాటికి రాళ్లు ఉడకబెట్టినా ఉడికేవేమో?! ఓ ఇల్లాలి రుసరుస.

పట్నం, పల్లె అనే తేడా లేకుండా ఈ డైలాగులు, సీన్లు ఇప్పుడు రోజూ వినిపిస్తూనే, కనిపిస్తూనే ఉంటాయి. తేడా ఎక్కడ వచ్చిందా అని ఆలోచిస్తే... ఒకప్పటి సేద్యం వేరు... ఇప్పటి సేద్యం ైస్టెల్ వేరు. అప్పటి వ్యవసాయం అచ్చంగా మనుషుల కోసం మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు మనుషులను పక్కన పెట్టి లాభాల కోసం పండిస్తున్నారు. ప్రకృతి మారింది. పద్ధతులు మారాయి. నాణ్యత మారింది. రుచి కూడా మారింది. అందుకే ఇప్పుడు మళ్లీ అందరూ పాతకాలం వ్యవసాయాన్ని ఆదరిస్తున్నారు. ఆర్గానిక్ ఆహారం వైపు పరుగులు తీస్తున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి, వారాంతపు సంతల వరకు ఆర్గానిక్ అనే పదం తారకమంత్రంలా జపిస్తున్నారు. 
ఏ ప్రజలైనా ప్రాంతీయ వంటలు, పంటలు ఇష్టపడతారు. అందుకే ఇక్కడి రైతుల నుంచే సేంద్రియ సేద్యం ద్వారా పండించిన పంటలు రైతుల దగ్గర నుంచి సేకరించి అందిస్తున్నది సుజాత రమణి. నిజామాబాద్, జహీరాబాద్, ఇబ్రంహీంపూర్ గ్రామాల రైతుల నుంచి గోధుమలు, బియ్యం, పప్పులు వంటి ఆహార ధాన్యాలు సమీకరిస్తున్నది. బియ్యం, పప్పులు, పిండి, ధాన్యాలు కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన రైతుల నుంచే సేకరిస్తున్నది.

రైతులకు చేయూత...


చిన్న, సన్నకారు రైతుల నుంచే సుజాత ఆహార ధాన్యాలు సేకరిస్తున్నది. వర్షం మీద ఆధారపడి పంట పండించే రైతులకు చేదోడువాదోడుగా ఉంటూ, వారిని ప్రోత్సహిస్తూ వారి దగ్గర నుంచి పంట కొనుగోలు చేస్తున్నది. సహజసిద్ధంగా విత్తనాలు, క్రిమి సంహారక రసాయనాలు వాడకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎలా వ్యవసాయం చేయాలో కూడా చెప్తున్నది. ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలి? మార్కెట్లో ఏ పంటలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది? అనే విషయాలు రైతులకు అర్థమయ్యేలా చెప్తూ వారు లాభాలు గడించేలా సూచనలు చేస్తున్నది. నాణ్యమైన పంట పొందేందుకు నాణ్యమైన పద్ధతులే మార్గం అంటున్నది సుజాత రమణి. అవసరమైతే ముందుగానే రైతులకు కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తున్నది.

దానే దానేపే కిసాన్ కా నామ్...


అవును... మామూలుగా అయితే దానే దానేపే ఖానేవాలేకా నామ్ అంటారు. కానీ ఉండాల్సింది అది కాదు మనం తినే ప్రతీ గింజ మీద రైతు పేరుండాలి అంటోందీ సుజాత. తను అమ్మే ప్రతీ ప్యాకెట్ మీద రైతు పేరు, పంట వేసిన సీజన్, కోసిన సమయం, ఊరు వంటి వివరాలన్నీ ముద్రిస్తున్నది. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు గుర్తింపుండాలి. రైతు పండించిన పంట కొని వాటికి తమ బ్రాండ్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు. రైతుకు గుర్తింపు లేకుండా పోతోంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా పంట వేయాలంటే దానికి మ్యాన్‌పవర్ ఎక్కువ అవసరం ఉంటుంది. దానికి ఖర్చు కొంచెం ఎక్కువ. మార్కెట్లో దొరికే ఆహార ధాన్యాల కంటే సంప్రదాయ పద్ధతుల్లో పండించిన పంటలకు కొంచెం ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం తెలియక చాలామంది ఆర్గానిక్ ఫుడ్ అంటే ధరెక్కువ అనుకుంటారు. కానీ అక్కడికి ఇక్కడికి ధరలో చాలా తక్కువ తేడా మాత్రమే ఉంటుంది అంటోంది సుజాత రమణి.

ఇలా మొదలైంది...


అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది సుజాత రమణి. 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్గానిక్ ఆహారం గురించి అవగాహన కల్పించే స్వచ్ఛంధ సంస్థల్లో సభ్యురాలిగా చేరింది. హైదరాబాద్‌లోని లామకాన్ ఆర్గానిక్ బజార్‌లో నాలుగు సంవత్సరాలు ఆర్గానిక్ ఫుడ్ బజార్ నిర్వహించింది. రైతుల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు అమ్మకానికి పెట్టేది. వారానికోసారి పండించిన పంట అమ్ముకోడానికి హైదరాబాద్ వరకు రాలేక వారు పడే ఇబ్బంది గమనించింది. లామాకాన్ ఫౌండర్ ట్రస్టీ ఆషార్ ఫర్హాన్‌తో కలిసి 2015 అక్టోబర్ నెలలో దానా డాట్ ఇన్ పేరుతో ఒక వెబ్‌సైట్ రూపొందించింది. 

బియ్యం, గోధుమలు, గోధుమపిండి, జొన్నలు, జొన్నపిండి, కందిపప్పు, మినుములు, శనగపప్పు, పెసరపప్పు, పల్లినూనె, సన్‌ఫ్లవర్ నూనె వంటి రకరకాల ఆర్గానిక్ ఆహార దినుసులు అమ్మడం మొదలుపెట్టింది. సుజాత అమ్మే నూనెలు పూర్తిగా ఆరోగ్యకరం. కూల్ ప్రెస్డ్ పద్ధతిలో గింజల నుంచి నూనె తీయడం వలన అందులోని మినరల్స్, విటమిన్స్ అలాగే ఉంటాయి. మనం రోజూ వాడే నూనెలు అయితే గింజలను బాగా వేడిచేసి కరిగించి నూనె తీయడం వల్ల అందులోని మినరల్స్ కూడా కరిగిపోతాయి. ఆ నూనెల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి.

ప్రత్యేకతలివే...


రసాయనాలు లేవు..


సుజాత అందించే ధాన్యాలు సహజ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసినవి. ఎలాంటి రసాయనాలు వాడరు. పంటకు కావల్సిన ఎరువు కోసం స్థానికంగా తయారుచేసిన కంపోస్ట్‌ను మాత్రమే వేస్తారు. ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ వాడరు. ధాన్యాల్ని నిల్వ చేసేటప్పుడు కూడా ఎలాంటి రసాయనాలు వాడరు. తక్కువ ఉష్ణోగ్రతలో, సహజ పద్ధతుల్లో నిల్వ చేస్తారు.

సేంద్రియ విత్తనాలు...


జెనిటికల్‌గా మోడిఫైడ్ చేసిన విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు కాకుండా స్థానికంగా సేంద్రియ పద్ధతుల్లో వేసిన విత్తనాల ద్వారానే పంట వేస్తారు. ఒకే పంట నుంచి సేకరించిన గింజలను విత్తనాలుగా మార్చి సేద్యం చేస్తారు. సూపర్‌మార్కెట్లలో, దుకాణాల్లో దొరికే ఆహార గింజలు రకరకాల పంటల నుంచి సేకరించిన వేర్వేరు విత్తనాల నుంచి వస్తాయి.

స్వేచ్ఛా వ్యాపారం...


సుజాత రమణి నేరుగా రైతుల నుంచే ధాన్యం గింజలు సేకరిస్తారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తారు. కస్టమర్లకు కూడా నేరుగా రైతుల నుంచే తీసుకోమ్మని సలహా ఇస్తారు.

ఎకో ఫ్రెండ్లీ...


ప్యాక్ చేయడానికి, సైప్లె చేయడానికి ప్లాస్టిక్ అస్సలు వాడరు. నిల్వ చేసే సమయంలో కూడా ఎలాంటి రసాయనాలు వాడరు. పూర్తిగా పేపర్‌బ్యాగుల్లో ప్యాక్ చేస్తారు.

ఫ్రెష్‌గా... రుచిగా...


దానా డాట్ ఇన్ వెబ్‌సైట్ ద్వారా సుజాత అందించే ధాన్యాలు, పిండి, బియ్యం ఎప్పటికప్పుడు తాజాగా సేకరిస్తారు. ఎక్కువ కాలం నిల్వ చేయరు. సో... ఇక్కడ దొరికే ఆహార ధాన్యాలు తాజాగా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉండి, పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో పండించడం వల్ల రుచి కూడా బాగుంటుంది. రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఆలోచనకు తోడ్పాటు :


ఆర్గానిక్ ఫుడ్ అందరికీ అందించాలనే ఆలోచన సుజాత నాతో పంచుకుంది. అప్పటి నుంచి ఆర్గానిక్ ఫుడ్ గురించి అవగాహన కల్పించేందుకు పనిచేస్తున్నా. తెలంగాణ రైతులు వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆహార ధాన్యాలు, దినుసులు వారి నుంచే సేకరిస్తున్నాం. మన భూమిలో పండే పంటకు రుచి, సత్తువ కూడా ఎక్కువ. అందుకే ఆ సత్తువ అందరికీ అందించాలని ఈ ఆలోచన చేశాం.
- ఆషార్ ఫర్హాన్, కో ఫౌండర్, దానా డాట్ ఇన్ 
-ప్రవీణ్‌కుమార్ సుంకరి
-రామ్‌కుమార్ దుగ్యాల